'డ్రెస్సు'... :- ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


 నా కూతురు నాగరాణి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి నాగధర వెళ్లాను. మీ ఊరు నుండి బదులుగా ఆ వూరు వచ్చినా.. మా ఊరితో మమకారం నాలోనే పదిలంగా ఉంది. దసరాకు ముందు వెళ్లడంతో... మీ ఊరిలో ఎప్పుడూ పండుగ చేసుకుంటారు కదా, ఈసారి మా ఊరిలో పండుగకు ఉండమని ఒత్తిడి చేశారు గ్రామస్తులు. తప్పనిసరై ఉండవలసి వచ్చింది. నా శిష్యుడు రమేష్ టైలర్. సార్! మీకు దసరాకు డ్రెస్సు కుడుతా. కొలతలు ఇబ్బంది అన్నాడు. ఎందుకురా... నాకు ఇంటి వద్ద ఎన్నో దుస్తులు ఉన్నవి. ఈ ఒక్కరోజు లేకుంటే ఏంది? అని నేను అన్నాను. వాడు వినలేదు. బలవంతంగా కొలతలు తీసుకున్నాడు. అప్పటికప్పుడే డ్రెస్ కు ట్టాడు. దసరా రోజు ఆ డ్రెస్ వేసుకున్నాను. ఆ డ్రెస్సు ను అపురూపంగా చూసుకున్నాను. 10 సంవత్సరాల వరకు అ డ్రెస్ ను భద్రంగా దాచుకున్నాను. ఇది ఇప్పటికీ జీవితంలో మరవలేక పోతున్నాను. రమేష్ గురుదక్షిణగా ఇచ్చిన డ్రస్సు ఇప్పటికి నా దగ్గర జ్ఞాపకం గా ఉంది.