*బుజ్జాయి అలక!*:---డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి--అనకాపల్లి, విశాఖ జిల్లా
బుడి బుడి నడకల బుజ్జాయి!
బుంగమూతి పెట్టావేమమ్మా?
అటు వెళ్ళిన అమ్మ కనబడలేదనా?
ఆడుకునే బొమ్మ అందటంలేదనా?

ముసిముసి నవ్వుల చిన్నమ్మా!
మురిపించే అలకలు అదేలమ్మా?
ఎత్తుకు తిప్పేవారెవరూ లేరనా?
ఎగిరే పావురం కనబడలేదనా?