పండూ పండూ మామిడిపండూ
రెండూ రెండూ తిందాముండూ
తాతయ్య తోటలో బోలెడుపండ్లు
చెట్టుమీద పండితే రుచిగా ఉండూ !
అమ్మమ్మ ఇచ్చిందొక బంగినపల్లి
మొత్తంగా తినమని చెప్పింది మళ్ళీ
పెరుగన్నం మామిడిపండు నంజుకుతింటా
సరిపోటీ మా చెల్లి చూస్తే తంటా !
దోస్తులకి ఇచ్చాము దోరపండ్లు
తోటంతా ఘుమఘుమా చీమలు దండ్లు
ఉడతలకీ పక్షులకీ సందులేదు
వేసవిలో విటమిన్లకు కొరతేలేదు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి