వివక్ష-వర్ణవివక్ష(నానీలు)-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

1.దూరం పెట్టే 
   సంకుచితం
   పరిణతిలేని
   అజ్ఞానానికి‌ నిదర్శనం.

2.మానసికమైన‌
    దౌర్భల్యం
    కుటిలబుద్ధికి
    నిజసంకేతం.

3.ఈర్ష్య,అసూయల
   కలయిక
   గర్వం,అహంకారాల
   శూలిక.

4.అణచివేతల
   ధోరణికి
   ఆధిపత్యాల
   శిలా శాసనం.

5.మూఢాచారాల కుటిల
   మూర్ఖత్వం
   సంప్రదాయాల నీచ
   రాద్ధాంతం.

6.పెద్దరికం పేరిట
   రాక్షసం
   పాపం పేరిట
   జరిపే మోసం.

7.అనాదిగా 
    పేరుకుపోయిన
    సమాజపు
    ఋజాగ్రస్త అంగం.