చిట్టికి దొరికిందో చిక్కుడు గింజ
మట్టిలో తవ్వి పాతిందా గింజ
చారెడుకళ్ళతో ఆశగా చూస్తుంది
ఎన్నిరోజులైనా గాని మొక్కరాలేదు!
మరిచిందిక నిరాశతో గింజ సంగతి
అమ్మమ్మను అడిగింది చెట్లగురించి
మొక్కలెలా వస్తాయి ఓ అమ్మమ్మా?
నే నాటిన గింజసలు మొలవలేదమ్మా!
పాతినగింజకు నీవు నీరుపోసావా?
పోయలేదు అమ్మమ్మా మట్టికప్పాను!
ఫక్కున నవ్విఅమ్మమ్మ ఇలా చెప్పింది
మొక్కలు మొలకలు రావాలంటే
గాలి నీరు సూర్యుడు అవసరం
నీటితడితో ఉబ్బిన గింజకు
సత్తువ వస్తుంది ఓ చిట్టీ
గింజలోపల పప్పుబద్ధలు రెండు ఉంటాయి
రెంటికి మధ్యలో సన్నగా అంకురముంటుంది
నీటితడితో ఉబ్బిన గింజకు
పైపొర తొలగి పోతుంది
పప్పుబద్దల మధ్య అంకురం
చేతనావస్థకు చేరుకుంటుంది
మట్టిని చీల్చుకు గింజపైకి లేస్తుంది
అంకురం అడుగున వేరుపుడుతుంది
పైభాగం రెండాకులు బీజదళాలు
పప్పుబద్ధలు ఆహారంగా పైకీవస్తాయి
ఎదిగిన మొక్కకు వేరుతల్లి ఆహారమిస్తుంది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి