చదువే భాగ్యం: - కవిత వేంకటేశ్వర్లు
బాలలు బాగుపడండి
చదువే భాగ్యమని తెలుసుకోండి
చదువుపైనే శ్రద్ధ పెట్టండి
చదువుపైనే దృష్టి పెట్టండి

ఆటలు ఆడండి
పాటలు పాడండి
పోటీల్లో పాల్గొనండి
గెలిచిన ఓడిన పగ పెంచుకోకండి

మిత్రులను కలవండి
మనస్ఫూర్తిగా మాట్లాడండి
ఈగోలతో రోగాలు తెచ్చుకోకండి
తరగతులకు బంకు కొట్టి
సినిమాలకు వెళ్ళకండి

చెడు అలవాట్లు మంచిది కాదు
దురలవాట్లకు దూరంగా ఉండు
నిత్య విద్యార్థివై చరిత్ర తెలుసుకో
ఎందరో మహనీయుల జీవిత
విలువలు తెలుసుకొని నడుచుకో!!