'కథల తాతయ్య'....: - ఎన్నవెళ్లి రాజమౌళి

 
 30 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తి నిర్వర్తించాను. పాఠాలు చెబుతూనే... పిల్లలకు కథలు, పాటలు, పద్యాలు వినిపించే వాడిని. వాళ్ల పాటలు, కథలు, పద్యాలు వినేవాడిని. ఎక్కువ కు ఎక్కువ 1, 2 తరగతుల లో గడిపేవాడిని. వాళ్లతో ఆడడం, పాడడం నాకు సరదా. పిల్లలు నన్ను కథల సారు అని పిలుస్తూ ఉండేవారు. రిటైర్డ్ తర్వాత నా గురించి పేపర్లో కథల సారు అని ఆర్టికల్ వచ్చింది. అది చూసి తొగుట మండల ఎం ఈ ఓ రాజేశ్వర్ రెడ్డి గారు ఫోన్ చేసి అభినందించారు. అభినందనలు కాల్ సార్... నేను మళ్ళీ కథలు చెప్పడానికి స్కూల్ లోకి వస్తాను. అన్నాను. సరే అని, ఆ కొరకు ఆయన సర్కిల్ రాసిచ్చారు. అలా ప్రారంభమైన నా ప్రస్థానం ఎనిమిది సంవత్సరాలు కొనసాగింది. పూర్వ తెలంగాణ పది జిల్లాల లోని 24 మండలంలో గల 309 పాఠశాలలో ప్రదర్శనలు ఇచ్చాను. అభినయిస్తూ, పిల్లలను అభినయింప చేస్తూ... కథలు, పాటలు, పద్యాలు వినిపించాను. కాళ్లు చదివినవి కూడా విన్నాను. దీనికి బాలవికాస యాత్ర అని ఐతా చంద్రయ్య గారు సూచించారు. ఈ యాత్ర అ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లల స్పందనతో ఎనిమిది వ్యాసాలు రాశాను. ఐదు వ్యాసాలు పత్రికలో ప్రచురణ పొందాయి. మొలక మాసపత్రికలో రెండు వ్యాసాలు వచ్చాయి. ఈ స్ఫూర్తితో 12 పాల కథలు రాసాను. ఇందులో నుండి కూడా మూడు కథలు మొలక పత్రికలో రాగా-మిగతావి ఇతర పత్రికలలో కూడా వచ్చాయి. గుర్రాలగొంది లో ప్రదర్శన తర్వాత వస్తుంటే ఆరవ తరగతి అమ్మాయి కథల తాతయ్య అని అన్నది. ఆ.. సారును తాతయ్య అంటావా... అని పెద్దమ్మాయి అనగానే-అన్న నీ అమ్మ... నేను తాతయ్య నే కదా... అని అన్నాను. పిల్లలందరూ బై కథలు తాతయ్య అని ముక్తకంఠంతో ఉన్నారు. అలా కథల తాతయ్య అని నా పేరు ముందు చేరింది.
నోటు: నా జీవితంలోని సంఘటనలను 28 భాగాలు మీ ముందుంచాను. మొలక లో ప్రచురించిన వేదాంత సూరి గారికి, చదివిన పాఠకులకు కృతజ్ఞతలు. సెలవు. జై విజ్ఞాన్.