పల్లకి మోసే బోయలు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ఒహోయి ఒహోయి అనుకుంటు
పల్లకి మోసే బోయల్లార
బొమ్మల పెళ్లి చేస్తాము
పల్లకి మోయగ వస్తారా

శివపార్వతుల బొమ్మలు
సీతా రాముల బొమ్మలు
రాధా కృష్ణుల బొమ్మలు
అన్ని బొమ్మల పెళ్లండి

సూర్య చంద్రులు చుట్టాలు
దేవతలంతా పక్కాలు
చుక్కలన్ని అక్షంతలు
ఉరుములు మెరుపులు బాజాలు

ఆకాశమంత పందిరి కింద
భూదేవి అంత గద్దెల మీద
అన్ని బొమ్మల పెళ్లండి
పండ్లు ఫలాల భోజనమండి

బొమ్మల పల్లకి మోయండి
సూర్యచంద్రుల చూడండి
చుక్కల అక్షంతలు చల్లండి
విందు భోజనం చేయండి