పేపర్ బాయ్ -మెరుపులు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చదువుకునే పిల్లవాడు 
అవుతాడు పేపరుబాయ్ 
ఉదయమే వేస్తాడు 
పేపర్తో సంపాదనోయ్ !

ఇంట్లోవారికి సాయంగా
వేణ్ణీళ్లకు చన్నీళ్ళుతోడు 
బాల్యంలోనే ఉపాధిదిశగా 
ఆత్మబలమే చూపుతాడు !

కాఫీతోటి పేపరుండాలి 
లేకుంటే మనసులోటు 
పేపరబ్బాయి రావాలి 
కళ్ళుఅతుక్కునే ఇంటిగేటు !

వానల్లోన నడిచేవచ్చి 
తడవని పేపరిస్తాడు 
చిరిగిన గొడుగునేమెచ్చి 
వార్తలు అందిస్తాడు !

ప్రోత్సాహం ఒకపల్కరింపు 
సంకల్పానికి విస్మయం 
ప్రేమతో ఆదరింపు 
దశరాకి తోచినసాయం !



కామెంట్‌లు