కలలు-అలలు :--కళావతి కందగట్ల-హైదరాబాద్
కలలు అలలు
ఒకటే....
అలల ది ఆరాట మైతే
కలల ది పోరాటం

 సుడిగుండాలకు
 సునామీలకు 
 ఆదరవు బెదరవు ...
 కడలి కల్లోలమైనా
 తీరం చేరాలనే ఆశయంతో 
 పయనిస్తూనే ఉంటాయి
 కెరటాలు...

సేద తీరుతూ
నిదుర పోతున్న 
కనురెప్పల వాకిళ్లలో
పురడోసుకున్న కలలు..,

వాటి సాకారానికి
మనిషి మదిని
మదనపెడుతూనే
ఉంటాయి ...
అవి తీరేవరకు ఆపని
పోరాటం చేయాలని
ఉత్తేజ పరుస్తూనే ఉంటాయి