గడ్డకట్టిన హిమాలయాల కండలు కరుగుతున్న వేమో !?
శక్తివంతమైన ఆకాశం నోరు తెరుచుకుంటుంది!!?
వెనక్కి వెళ్తున్న కొండల నీడలు భూగోళాన్ని ఢీకొంటున్నయి!?
అయినా అనాదిగా మానవుడు పుష్పీస్తునే ఉన్నాడు!?
పచ్చని దనం సముద్రంలో దాచి ఉంచిన భూమిపై మేఘాలయై తేలియాడుతున్న వి!
పరాక్రమంతో ఆక్రమించిన వృక్షాలు ఇక నిటారుగా నిలబడ్డ లేకపోతున్నాయి నేలకొరిగిన నీటిలాప్రవహిస్తూనే ఉన్నాయి!?
కల నిజంకా లేదని గడ్డిపువ్వు కోటి జన్మలు ఎత్తుతూ తూర్పున సూర్యుడు ఉదయించే దాకా రహస్యంగానే ఉంది!?
వెలుగును ఎగరేసిన జెండా తానై లోకం ఆకలి కౌగిలిలో మౌనంగా గాయం మాన్పుకునీ అంతరాత్మకు శరీరం ఇచ్చి ప్రపంచం మెచ్చిన పచ్చని ఆకు మానవుని కన్నతల్లి!?
, ఎండిన మండిన ఆశ లేని ఆఖరి శ్వాస దానిది మనిషి కోసమే మగువల ప్రతి పొద్దు పొద్దు లో మొగ్గ తొడుగుతుంది!!
మొక్కలేఅయినా మనిషికి రెక్కలు ఇచ్చిన దేవుళ్ళు
జీవుల్ని పూలమాలవేసి పచ్చని ఊయలలో పురుడు పోసి పుడమి ఆడదే అని చెప్తుంది!
కంటే కన్నుకు ఏడు రంగుల కలలు పుడితే స్వచ్ఛమైన ఆకుపచ్చని రంగేఆ మానవుడీ అసలు రంగు !!!
గతం మర్చిన మనిషి భూమిపై సుడిగాలిలో చిక్కుకుంటే కాపాడింది చెట్టు నీటిలో సుడిగుండంలో చిక్కుకుంటే ఒడ్డుకు చేర్చింది చెట్టు!!!?
ఎదురించి నిలిచిన ఎండుటాకు చివరి వరకు పోరాడిన పండుటాకు కాళ్లపై నడుస్తున్నది చేతులతో పని చేస్తున్నాయి ఒక్కసారి చక్కగా చూడు అతడే మానవుడు!!!?
జలం ఇంద్రజాలంలో జన్మించిన కిరణం స్వయంవరం లో గెలిచిన ప్రపంచానికి పంచభక్ష పరమాన్నం అయినా పచ్చని చెట్టు ఎప్పటికీ మనిషి పొడిపించుకున్న పచ్చ బొట్టు !!?
Pratapkoutilya
8309529273
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి