ఉప్పండి -ఉప్పు: - సత్యవాణి

 సంద్ర పొడ్డు చదును జేసి
చక్కగాను గట్లు కట్టి
అలను పట్టి మడిలొ పెట్టి
ఆరగట్టి ఆరబెట్టి
ఎండబెట్టి గుట్ట పెట్టి
మల్లెపూల గుట్టలాగ
మంచు శిఖర మల్లెతోచు
స్వచ్ఛమైన ఉప్పుగుట్ట
సంపదిచ్చు ఉప్పు పంట
రుచినిదెచ్చు మాగాణి పుట్ట
కష్ట జీవి కలిమి పంట
చేర్చ బడును బండిలోకి
చెడదిరుగును వీధులందు
ఉప్పోయమ్మ ఉప్పంచు
ఉత్తి కాళ్ళు మెత్తబడగ
ఊరుారా తిరిగి తిరిగి
బ్రతుకు చప్పనైనగాని
బడుగు జీవి యైనగాని
విసుగొందక వేసారక
ఆశతొబండిని నడిపెడి
 అలను పట్టు మేధావి