మృదూవైనదే మేలైనది:-- యామిజాల జగదీశ్
 ఆ వృద్ధ గురువు మరణశయ్యపై ఉన్నారు. ఈ క్షణమో మరుక్షణమో ఆయన ప్రాణం పోయేట్టుంది. శిష్యులందరూ ఆయన చుట్టూ నిల్చున్నారు. ప్రాణంపోయే తరుణంలోనూ గురువుగారు తమకు ఏదన్నా ఉపదేశిస్తారేమోనని శిష్యుల ఆశ. 
మనసులోని మాటను వారు వినమ్రంగా చెప్పుకున్నరు.
అప్పుడు గురువుగారు నోరు తెరచి చూపించారు. శిష్యులు గురువుగారి నోట్లోకి చూశారు. కానీ వాళ్ళకేమీ బోధపఢలేదు.
వారి అయోమయస్థితిని గ్రహించిన గురువుగారు తన నోట్లో పళ్ళున్నాయా అని ప్రశ్నించారు. 
శిష్యులు ఠకీమని ఒక్కమాటగా చెప్పారు "మీ నోట్లో ఒక్కటంటే ఒక్క పన్ను లేదని"
అనంతరం గురువుగారు "చూసేరా....బలమైంది క్రూరమైందీ అనుకున్న పళ్ళేమో మధ్యలోనే రాలిపోయాయి. మెత్తటిదీ మృదువైనదీ అనుకున్న నాలుకే మనిషి తుదిశ్వాసవరకు అతనితో ఉంటుంది. దౌర్జన్యమో బలప్రయోగంతోనో ఏదన్నా సాధించుకున్నా దాన్నెవరూ పొగడరు. మృదువైన చక్కని మాటలూ మంచి చేతలూ ఎవరినైనా ఆకట్టుకుంటాయి" అన్నారు.
శిష్యులకు విషయం బోధపడింది.