విద్య యిచ్చును వెలుగులు
జీవితమున జిలుగులు
విద్య లేకున్న మనిషికి
నిండు యుండు చీకటులు
విద్య యొసగును వినయంబు
ధనమొసుగును ధర్మంబు
విద్య వినయముతో యిలలో
నరుడు అనుభవించు సుఖంబు
సద్గుణములు లేని చదువు
దుర్గుణములకు యిక నెలవు
గబ్బిలాల కొంపలవలె
వదులుమింక దుచ్చేష్టలు
శీలము లేని విద్యలు
ఉప్పు లేని కూరలు
గుణములేని పుత్రులు
ఇలలో నేమి ఫలములు