(రామాయణంలోని పాత్రలు )ఊర్మిళాదేవి నిద్ర -మొగ్గలు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
జనకుని కుమార్తె ఊర్మిళాదేవి గానే 
లక్ష్మణస్వామి ఇల్లాలయింది ఆమె!
దేనికీ చలించని ధీరత్వం ఊర్మిళసొంతం!

సీతారాముల వనవాస ప్రయాణం తోనే 
లక్ష్మణుని వారించక నారచీరలు సిద్ధపరిచింది!
అంతఃపుర కాంతల గాంభీర్యం ఊర్మిళలో!

కారణజన్ముడైన శ్రీరాముని రక్షణకోసమే 
పతిఎడబాటును సహించే నిర్ణయంగొప్పది!
ప్రాపంచికవిషయాలు అంటని యోగనిద్రలోకెళ్ళింది!


మనోశక్తిద్వారా పతికి సన్నిహితంగా ఉంటూనే 
అతని ధర్మాన్ని ఆచరించే శక్తినిచ్చింది!
ఊర్మిళాదేవి విదేహుడైన తండ్రికి తగినపుత్రిక!

విస్మరించిన పాత్రగా తెరవెనుకనే 
ధృఢమైన కార్యాచరణ రూపం ఊర్మిళ!
కీలకమైన పాత్రగా యశస్సు పొందినది!

కామెంట్‌లు