తెలుగు సాహిత్య పరిశోధన.. విమర్శకులు.!:--సుజాత.పి.వి.ఎల్.

 డా|| మిరియాల రామకృష్ణ గారు(మిరా గా సుపరిచితులు) సుప్రసిద్ద రచయిత. శ్రీశ్రీ గారి కవితాశైలిపై ఆంధ్రా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పొందినారు. రామకృష్ణ గారు తెలుగు సాహిత్య విమర్శకులు మరియు పరిశోధకుడు. ఇతను సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నాడు. ఇతను మహాకవి శ్రీశ్రీ రచనల పై పరిశోధన చేశాడు. ఈ పరిశోధన అతిగా, అపసవ్యంగా సాగిందని విమర్శలు వచ్చాయి. ఇతను కథలు కొన్నే రాశాడు. వీరి కథలలో ఆకుపచ్చని కుక్కపిల్ల, ఆశ్చర్య చూడామణి, చెరసాలలో సరస్వతి, ఉంగరం వంటివి చెప్పుకోదగినవి. ఇతను కథలనే కాక పద్యాలను, వచన కవితలను, గేయాలను, వ్యాసాలను, బాలసాహిత్యాన్ని కూడా విరివిగా వ్రాశాడు. సుధాకిరణ్, ఆనందవర్ధన్ వంటి కలంపేర్లతో వీరి రచనలు వెలువడ్డాయి. వీరి రచనలు కళాకేళి, ఆంధ్ర పత్రిక, భారతి, తెలుగు విద్యార్థి, సుభాషిణి, నగారా మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతను 1995-96 ప్రాంతంలో గీతాంజలి పత్రికకు సంపాదకులుగా పనిచేశాడు. 
దేశం మేలుకుంది (బాలల గేయరూపకాలు)
బాలాభిరామం
రంగురంగుల రత్నదీపాలు
విద్యుద్వీణలు - వెన్నెల తీగలు
స్నేహదేహళి
సాహిత్య పదకోశం (ముకురాల రామారెడ్డి తో కలిసి) - తెలుగు అకాడమీ ప్రచురణ..రచనలు చేశారు.
(నేడు తెలుగు రచయిత, పరిశోధకులు..డాll మిరియాల రామకృష్ణ గారి జయంతి సందర్భంగా..)