తేలికైన ఆకాశం మీద పావురాల గుంపులు
నల్ల రోడ్డును అనుకొన్న ఎర్రమట్టి తివాచీ
ఎన్ని సాహసాలు
త్యాగాలు, ఎదిరింపులు పెనవేసుకొన్న ప్రాణ ఋతువు
కాలు పెడితే చుట్టు ముట్టి శ్వాస మీద
మట్టి ఆశల మొక్కై మొలుస్తుంది
చెట్లన్నీ వంగి వంగి సలామ్
చేస్తూ తనలా తపించే స్వయం పోశకాన్ని
పచ్చని పురుషార్థాన్ని ఎప్పుడూ మందార పూలతో అభిషేకిస్తుంది
చెట్టు మీద గువ్వ గోరింకలు వెచ్చని కౌగిలి లోంచి కరిగిపోని అమరత్వాన్ని
గుండెకద్ధి ప్రేమ తిలకం దిద్దుతాయి
వరి పొలాలన్నీ వయసుకు హుషారు గొల్పే
నవ యవ్వన మిస మిసల చిలిపి సంగీతం అందించే
తాన్సేన్ ప్రతిబింబాలు
చెరువుకు దగ్గరికి వెళితే చాలు ఆర్తిగా కాళ్ళను చుట్టూ ముట్టి
దాహం తీర్చి దాతృత్వ హేతువైన గుణసంహిత నిచ్చి మెచ్చు కొలుకు మచ్చు తునకను చేసే నీటి పాఠం
కలుసుకోవడం నిత్యం సత్యమైన విషయం తాత ముత్తాతల నుండి అందుకున్న జీవ తాఖీదు
అరుగుల మీది కచేరి ఊరి గుట్టును విప్పే కైలకట్ట
ఇవన్నీ పాతవే అయినా ఇంకా ఆ తీరు పదిలంగా వ్యక్తుల మదిసూర్లకు ఊరిలో వేలాడే ఉంది
వీటికి ఇరుకు బెరుకు
లేదు మనిషికి మనిషికి మధ్య దారిలోనే నాగ జముళ్ళు మొలిచాయి ఆలోచనా సుళ్ళలోనే సుడిగుండాలు
ఈ దార్లు హై వేల తల్లులే
కావ్యాల శోభిల్లన వర్ణ పటాలే
సినీ ప్రపంచంలో ఉదయించిన సూర్యబింబాలే
కాలం మారినా గతి తప్పని
గ్రహ గమనమే
ఇక్కడ అడుగు పెట్టి చూడు అడుగుకు వీరుల చైతన్య ముద్రలు అతుక్కుంటాయి నడిపించే శక్తి చక్రాలు చేతుల మీద ఆభరణాలవు తాయి
ఈ రోడ్డెప్పుడు నడుస్తుంది మనుషుల అనుభవాల వాకిల్లమీదుగా పలకరింపుల తోరణాల మీద బంధుత్వపు జాడల వెతుక్కుంటూ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి