సత్తయ్య సాహసం ...!!:- ------శ్యామ్ కుమార్, నిజామాబాద్.

 నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఊర్లో విచిత్రమైన అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి  జరిగింది .అతి మామూలు సాదాసీదా వ్యక్తి కూడా  పరిస్థితులను ఎదిరించి నిలబడి ఎలా గెలిచారన్నది ,ఈ సంఘటనతో  అర్థమవుతుంది. మన జీవితంలో మామూలుగా బాగా బలం ఉన్న వ్యక్తి గెలవడం, బలహీనుడు పోవడం జరుగుతుంది. అది మనం చూస్తూనే ఉంటాం. అయితే పరిస్థితిని బట్టి ఒక్కోసారి బలహీనుడుకూడా   బలవంతుడిగా మారిపోవడం ,ఆ బలహీనుడు బలవంతుణ్ణి- గెలవడం అన్నది చాలా విచిత్రమైన సంఘటన.
 నేను బోనగిరి లో ఉన్న బీచ్ మొహల్లా హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న రోజులు. మా ఇంట్లో నేను మా బాబాయ్, మా నానమ్మ ,ముగ్గురమే- ఉండేవాళ్ళం. మా బాబాయి గారు, ఆ  మా స్కూల్ లోనే ,సైన్స్ పాఠం చెప్పేవారు .కానీ గమ్మత్తేమిటంటే నాకు ఏనాడు సైన్సు నేర్పలేదు, లేదా నాకు ఏ రోజూ ట్యూషన్ చెప్పలేదు. పక్కన ఉన్న పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి చదువుకోడానికి మా ఇంటికి- వచ్చారు. మాకు తెలిసిన వారి యొక్క అభ్యర్ధనను మన్నించి, మా బాబాయి ఈ అబ్బాయిని, మా ఇంట్లోనే ఉంచుకున్నారు . అబ్బాయి పేరు సత్తయ్య. అతను  పదవ తరగతి చదువుతున్నాడు. మరీ చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన మూలంగా, అతనుకాస్త  మోటుగా ఉండేవాడు .పల్లెటూరి- వ్యక్తిత్వం. అతను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు .అతనికి  పద్ధతులుఅన్ని నేర్పించడానికి  మేము చాలా కష్టపడవలసి వచ్చేది .మా నానమ్మ అయితే రోజు తిట్టేది , మందలించే ది.  మా ఇల్లు మండువా ఇల్లు అంటారు. చాలా పెద్దది ,దాదాపుగా ఎనిమిది  రూములు  ఉండేవి. ఒక రూం లోఅతను  పడుకునేవాడు ,మాతో కలిసి భోజనం చేసేవాడు. ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్ళే వాళ్ళం.  అతను చదువులో చాలా వెనకబడి ఉండేవాడు. అప్పుడప్పుడు అతని  తెలివి చూసి నవ్వేవాడ్ని.  ఎనిమిదవ తరగతి చదువుతున్న నేను అతనికి అతని పుస్తకాలు చూసి పదవ తరగతి పాఠాలు  నేను చెప్పే వాణ్ని .అతడిని   గమనిస్తే కాస్త బలంగా గట్టిగా ఉన్నట్టు అనిపించేది .
 ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు కదా, పొలంలో పనులు చేసేవాడు !
 మా స్కూల్లో పదవ తరగతి చదువుతున్న-- అబ్బాయి ల్లో, ఒక అబ్బాయి కాస్త మీసాలు పెంచి, కసరత్తు చేసి ,పెద్ద  పైల్వాన్ లా ఉండేవాడు. అత ని చుట్టూ, ఓ పది మంది అబ్బాయిలు  ఉండేవారు. ఒక పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేసేవాడు అనుకోండి. టైట్ గా డ్రెస్ వేసుకుని, పాయింట్  షూస్   వేసుకొనిచాలా గర్వంగా ఉండేవాడు, అతన్ని చూసి అందరూ మర్యాదఇచ్చేవారు.
మాకు  ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి . సత్తయ్య కు  స్కూల్లో ఇంకో అబ్బాయి తో చిన్న గొడవ జరిగింది  ,సహ  విద్యార్థితో. ఆ రోజు ల లో చిన్న చిన్న గొడవలు మామూలే!అది ఏం గొడవ నాకు తెలీదు, ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, పైగా సత్తయ్య కూడా మాతో చెప్పలేదు. మేమిద్దరం మా   నానమ్మ పెట్టిన చద్దన్నం తిని, ఎగ్జామ్స్ కు రెడీ అయ్యి బయలుదేరాం.  ఒక చేతి లో 
 పెన్ను , ఇంకో చేతిలో ఎగ్జామ్ రాయడానికి - కార్డుబోర్డు తో తయారైన ,ఎగ్జామ్ ప్యాడ్ ఉండేది. ఇప్పుడు అలాంటి ప్యాడ్స్ కనిపించట్లేదు కానీ, ఆ రోజుల్లో ఆ ప్యాడ్ కు పెద్ద స్టీల్   క్లిప్ వుండేది, పేపర్      పెట్టడానికి .ఆ ప్యాడ్ దాదాపు 3 సంవత్సరాలు పని చేసే ది. మేము ఇద్దరం మాట్లాడుతూ స్కూల్- దారిలో నడుస్తు వున్నాము. మా ముందు వెనకాల కూడా అందరూ పరీక్ష టెన్షన్ తో నడుస్తున్నా రు.
ఇంతలో ఒక సైకిల్ మీద ,ఇద్దరు వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేసి,సర్రున ఆపి దిగారు. అందులో ఒకడు నేను చెప్పిన పహిల్వాన్. ఇద్దరూ కలసి మా సత్త య్య ను  కొట్టడం మొదలు పెట్టారు.  నేను బిత్తరపోయి  నిలుచుండి పోయాను. సత్తయ్య,ఎంత వా రి స్తున్న వాళ్ళు కొట్టడం ఆపలేదు. బాగా దెబ్బ లు తిన్నాడు సత్తయ్య. ఎందుకు కొడుతున్నారు ఏమిటి అని అడిగితే కూడా, వారు సమాధానం చెప్పకుండా ఇంకా కొట్టడం మొదలుపెట్టారు.  అప్పుడు సత్తయ్య తన ప్రతాపం చూపించాడు. చేతిలో ఉన్న  ప్యాడ్ తో ఎడాపెడా వాయించడం  మొదలుపెట్టాడువాళ్ళని.  ఒక చేతితో ప్యాడ్ తో  ,ఇంకో చేతిలో ఉన్న  పెన్నుతోవాళ్ళని ఎడాపెడా  ఎదురుదాడి మొదలు పెట్టాడు. విపరీతమైన ధైర్యంతో ఆ పల్లెటూరి బలంతో కొట్టడం మొదలు పెట్టాడు.  ఆ ఇద్దరు   పహిల్వాన్ లకు   వాడి దెబ్బలు తట్టుకోవడంవీలు కాలేదు.  వాళ్ళు కొట్టడం మానేసి దెబ్బలు- తట్టుకోవడం మొదలుపెట్టారు. చుట్టూ నిలబడి చూస్తూ  ఉన్నవాళ్లు ఆశ్చర్యపడి చూస్తున్నారు
కొద్దిసేపటికి వారు దూరంగా పరిగెత్తి వారి సైకిల్ తీసుకొని పారిపోయారు. ఇంక మా సత్తయ్య, బట్టలు తొడుక్కుని వాడి, పెన్ను తీసుకొని మళ్ళీ ఎప్పట్లా ఎగ్జామ్స్ కు బయలుదేరాడు .మేము ఇద్దరం ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్లీ మా ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము స్కూల్ నుంచి. మా ఇల్లు దాదాపుగా రెండు ఫర్లాన్గులు ఉండేది. స్కూలు బయటికి ,గుంపులుగుంపులుగా మేము అందరం వచ్చాము .అంతలో చూస్తే ఆ పైల్వాన్ మరికొందరు తీసుకువచ్చి, ఎదురుగా నిలబడ్డాడు. పరిస్థితి నాకు అర్థం అయిపోయింది. అందరూ కలిసి  ఉతిక  వేస్తారు ఇంక సత్తి పని అయిపోయింది అనుకుంటూ నిలబడ్డాను.  కానీ ఈ సంగతి చుట్టూ ఉన్న విద్యార్థులు కానీ, అటుగా బయటకు వెళ్తున్నా టీచర్లకు, కాని తెలియదు.  మళ్లీ అందరూ కలిసి మూకుమ్మడిగా ,తన మీద దాడి మొదలుపెట్టారు. అతను పక్కగా పరిగెత్తి అక్కడే ఒక దుకాణం ముందు పెట్టిన పందిరి కి ఉన్న    వెదురు బొంగు   ను,  ఊడ పెర కాడు. ఇహ  దాంతో అందరిని బాదటం మొదలుపెట్టాడు. ఎడాపెడా ఎటు తిరిగితే అటు వాయిన్చాడు. కొద్దిసేపటికి మా... ఉపాధ్యాయులు ,హెడ్మాస్టరు వచ్చి అందర్నీ విడదీసి మధ్యలో వచ్చి అందర్నీ పంపించేశారు. ప్రాణాలకు తెగించి, ఒక మనిషి ఎదురు తిరిగితే ఏలా ఉంటుందో అర్థం అయ్యింది నాకు.   పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు, ఎలా ధైర్యంగా ఉండాలో ఎలా యుద్ధం చేయాలో ఎలా గెలవడం  అన్నది
ఆ సమయంలో నాకుబాగా తెలిసింది.  పరిస్థితులను గెలవడానికి యుద్ధంలో వ గెలవటానికి శారీరక బలమే కాకుండా ,మానసిక ధైర్యం అనేది ముఖ్యం అన్నది నాకుఅప్పుడే అర్థం అయింది.  అమాయకత్వమే కాకుండా, శారీరక బలమే కాకుండా, మానసిక ధైర్యం అనేది ఎలా ఉంటుందో చూపించాడు  మా సత్తయ్య.  అందుకేనేమో నేను నా జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీపడకుండా ,ఎవరికీ లొంగకుండా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నాకంటే ఆరు సంవత్సరాలు   ఎక్కువ వయసున్న సత్తయ్య ఈమధ్య నే ,మృత్యువుతో ,పోరాడి ,ఓడిపోయాడు. 
అయినా ,ఈ ఓటమి సత్తయ్యకు ఒక లెక్కలోనిది 
కాదు .నాలాంటి వాళ్ళ జీవితాలను ప్రభావితం 
చేసిన మహానుభావుఁడు మా ..సత్తయ్య.!!