ఎవుసం(వచనకవిత):డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 పుడమితల్లి పులకించి
హలాల దున్నడాలకు
అమృతాల పైరులనందిస్తుంది.
నీటితో అభిషేకించబడి
విత్తనాలతో అలంకరింపబడి
ఎరువులతో దిష్టితీయబడి
కలుపుమొక్కల ఏరివేతలతో
శుభ్రమొనరింపబడి
ఎండకు,వానకు,చలికి,గాలికి,
ధూళికి,తుఫానులకు సంవేదనలు పొంది
జోడెడ్ల కాడిపై,స్వేదం చిందిస్తున్న
రైతన్న మానసపుత్రికై
అంతకంతకు పచ్చగాపెరిగి
స్వచ్ఛమైన ప్రకృతిలో ఒలలాడుతూ
ధాన్యరాసులు,కూరగాయలను
పూలు,పండ్లను విరివిగా ఇస్తుంది
బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ
సారవంతమై,పవిత్రమై వర్ధిల్లుతుంది.
కృషీవలుల చేతుల్లో వ్యవసాయం అన్నపూర్ణై
ఆవిష్కరిస్తుంది.
దేశానికి వెన్నుముకై
రాష్ట్రానికి తలమానికమై
ఉత్పాదక రంగాన అమృతమై
నిలబడుతుంది.
వ్యవసాయం దైవసాయమై
మానవాళి జీవనాన్ని ఫలవంతమొనర్చుతుంది.
కామెంట్‌లు