*సన్మానం*: --లీలా కృష్ణ .తెనాలి.
అవమానాలకు ఎదురొడ్డి.. నిలవడమే, గొప్ప సన్మానం..!!

అంతెరుగని ఈ విశ్వంలో ..
నీ  వంతు పాత్రను , పొందడమే..
మరువలేని బహుమానం..!!

అంధకారాన్ని అధిరోహించడమే..
జీవకోటి అందుకునే, మొదటి విజయం..!!

అనేక పరిణామాల కూడికల కలబోతే..ఈ జీవ పరిణామం..
అంత అందమైన కలబోతను,
ఏమని వర్ణించగలం..!!

బొడ్డు త్రాడు బిగిసింది మొదలు..
గిట్టే చివరి గడియ వరకు,
ఆజన్మాంతం నీలో దాగున్న వరమే.. రక్తసంబంధం..!!

అందమైన ఎముకుల అమరిక, కని..
తనకు సన్మానం చేయబూని..
చక్కని తోలుతో  ఆ అమరికను సన్మానించెను
 ఆ పరమాత్మ.. తనను తాను మెచ్చుకుని..!!

అలుపెరుగని జీవ పోరాటపు కథలు విని..
తనను తాను స్రవింప చేసుకొని..
వర్షమనే, హర్షధ్వానాలు కురిపించడమే..
ప్రాణి పలుకు విన్న.. మిన్ను పని..!!

సన్మానంతో మొదలై..
స్మశానంలో మరుగై ..
తుదకు, కథ కంచికి చేరడమే..
మనసెరిగిన పని అని..
నన్ను చెప్పని..!!