చెరగని స్మృతులు ::-- లీలా కృష్ణ.
తొలిసారి తిరుమల వాసుడుడిని చూసిన నా కళ్ళు..
మరువనన్నాయి ముగ్ధమనోహర రూపాన్ని ..  బ్రతికినన్నాళ్లు.

పెరటిచెట్టుకి కాసిన , తొలి పిందెలు...
నింపాయి.నాలో... చెరగని గుర్తులు.

పురిటి నొప్పి పుట్టించిన ,నొప్పుల వేదనలు..
మిగిల్చాయి మదిలో... మరువలేని స్మృతులు.

నా తొలకరి

కవితకు దక్కిన ప్రశంసలు.. 
అద్దాయి, ఆలోచనా శైలికి.. కొత్త రంగులు.

నిలువద్దము చూపుతుంది , మనుషుల ప్రతిబింబాలు..
మనిషి చేసిన పనులు నింపుతాయి... చరిత్ర పుస్తకపు పేజీలు.



కామెంట్‌లు