అమ్మతనం-చనుబాలు-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
1.అమ్మాయి అమ్మై
    సంపూర్ణమవుతుంది.
    సంతు పైనే
    ప్రేమ ప్రారంభమవుతుంది.

2.తన తనువు 
   పంచి జనని
  చనుబాలతో 
  ప్రాణం పోస్తుంది.

3.తల్లి పాలు
   రోగనిరోధకశక్తినిస్తాయి.
   జనని అమృతం
   తాగిస్తుంది.

4.తన రుధిరాన్ని 
   పాలగా మారుస్తుంది.
   చనుబాలతో
   ఆయుష్షు పెంచుతుంది.

5.గుక్కపట్టి 
   బిడ్డ ఏడిస్తే
   ఎక్కడున్నా సరే
   తరలివస్తుంది.

6.ఆకలివేస్తే
   కడుపు నింపుతుంది.
  ఎంతమందిలో ఉన్నా
  బిడ్డకే ప్రాధాన్యం.

7.కాలం మారినా
  తాను మారలేదు.
  ప్రేమ పంచడం
 ఆగిపోలేదు.