ఉడుత -జాంపండు :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చిన్నారి ఉడుతకు 
జాంపండు దొరికింది 
చాలా సంతోషంతో 
చుట్టూరా తిరిగింది !

కొమ్మలోపల  కాళ్లు 
వాటంగా పెట్టింది 
పండును ముందున్న 
కాళ్లతో పట్టింది !

భయంతో అటుఇటు 
ఉలికిపడి చూస్తుంది 
పండుపై పొరకాస్త 
ఇష్టంగా తింటుంది!

లోపలున్న గుజ్జు 
తీయగా తగిలింది 
పొట్టనిండా తిని 
ఉడుత చెట్టెక్కింది!

ఇంటిలో ఒకపాప 
వింతగా చూసింది 
పప్పులూ గింజలు 
గోడపై పోసింది !

నిక్కి నిక్కీ  చూసి 
ఉడుత దిగి వచ్చింది 
ఒక్కొక్క గింజనూ 
రుచిచూసి వెళ్ళింది!