యలమర్తి అనురాధ కు ఉగాది పురస్కారం ఫ్లవ ఉగాది వేడుకలు,కవితా వసంతం(లఘు కవితా సమ్మేళనం)చిమ్మపూడి ఫౌండేషన్ శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త నిర్వహణలో 10.4.2021 సాయంత్రం 6 గంటలకు కళా కళా వేదిక శ్రీ త్యాగరాయ గానసభ,చిక్కడపల్లి, హైదరాబాద్ లో సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి గారు,సభాధ్యక్షులుగా సినీ దర్శకులు శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు, గౌరవ అతిథిగా నేటి నిజం సంపాదకులు శ్రీ బైస దేవదాసు దేవదాసు గారు విచ్చేశారు. కార్యదర్శి చిమ్మపూడి వెంకట సత్యనారాయణ గారు సభకు సారథ్యం వహించారు.
    మన గాయత్రి నగర్ ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ తమ కవితలను వినిపించి ఉగాది పురస్కారాన్ని అందుకని పలువురి ప్రశంసలు పొందారు.