కత్తి పడవ (బాల _కథ ):-డా.కె.ఎల్.వి.ప్రసా ద్,-హనంకొండ.

 సావిత్రి తన ఐదేళ్ల కూతు రు,శిరీషను ను తీసుకుని 
దిండి ,తన పుట్టింటికి బయలుదేరింది .శిరీషకు ఎట్లాగూ బడి లేదుకాబట్టి ,ఎప్పటినుంచో తల్లిదండ్రుల ఆహ్వానాన్ని మన్నించి ,ఉద్యోగస్తుడైన 
భర్త శ్రీదర్ ను ఒప్పించి ,మొదటసారి ఒంటరిగా ,కూతురితో పయనమైంది సావిత్రి.అమ్మ మ్మ ,ఊరికి వెళుతున్నామన్న ఆనందంతో శిరీష 
తన్ను తాను మరచిపోయి ఊహాలోకంలో  విహరిస్తోంది శిరీష .చాలాకాలం తరవాత పుట్టింటి 
కి వెళుతున్న సావిత్రికి ,ఎప్పుడు ఇంటికి వెళతామా 
అన్న ఆత్రుత ,తెలియని టెన్షన్ మొదలయింది ఆమెలో .
ఆరున్నర గంటలకు హైద్రాబాద్ _నర్సాపూర్ ఎక్ష్ప్రెస్ 
రైలు పాలకొల్లు స్టేషన్లో ఆగింది .ఒకచేత్తో శిరీషను 
మరో చేత్తో  సూట్కేస్ పట్టుకుని రైలు దిగింది సావిత్రి 
సరిగ్గా వాళ్ల కంపార్టుమెంటు దగ్గర నిలబడి ఉన్నాడు 
సావిత్రి తండ్రి వెంకట్రావు .తాతయ్యను చూడగనే 
" తాతా .." అంటూ ,తల్లిని విడిపించుకుని వెళ్లి తాత 
చేయి పట్టుకుంది శిరీష." అమ్మడూ .." అంటూ ఎత్తుకుని మనవరాలిని ముద్దు పెట్టుకున్నాడు 
వెంకటరావు.
బయట వాళ్ళకోసమే ఎదురుచూస్తున్న టాక్సీలో 
లగేజి పెట్టి ముగ్గురూ లోపల కూర్చున్నారు .
డ్రైవరు ప్రక్క సీట్లో వెంకట్రావ్ మనవరాలిని ,వళ్ళో 
పెట్టుకుని కూర్చున్నాడు .వెనక సీట్లో  సావిత్రి కూర్చుంది .అప్పుడే వర్షపు చినుకుల హడావిడి 
మొదలయింది.సావిత్రికి ఆదారి పరిచయమైనదైనా 
అంతా కొత్తగా అనిపిస్తోంది.పశ్చిమ గోదావరి జిల్లాతో ,తూర్పు గోదావరి జిల్లాను కలిపే  చించినాడ 
బ్రిడ్జి కి చేరుకోగానే ,బ్రిడ్జిక్రింద నిండుగా ఉన్న గోదావరిని ,మనవరాలికి ,చూపిస్తున్నాడు తాత 
వెంకట్రావు .శిరీష ఆనందంతో ,ప్రశ్నలమీద ప్రశ్నలు 
గుప్పిస్తోంది తాతయ్యమీద .
పదిముషాల్లో ఇల్లు చేరింది టాక్సీ .తల్లి సుందరమ్మను చూసి ప్రేమగా కౌగలించుకుంది 
సావిత్రి .ఆ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంది 
సుందరమ్మ .
స్నానాలూ ,టిఫిన్లు ముగించాక ,వెంకట్రావు పని 
మీద ,పక్క గ్రామం రామరాజు లంకకు వెళ్లాడు .
తల్లీ _కూతుళ్లు ,సుందరమ్మ ,సావిత్రి లు ,కబుర్లు 
చెప్పకుంటూ ,వంటపని చేసుకుంటున్నారు.శిరీష 
ఇల్లంతా కలియతిరుగుతూ ఆడుకుంటుంది .
వర్షంలో తడుస్తూ ఆడుకోవాలని ఆమె కోరిక .
                 కబుర్లతో కాలం తెలియని ,సావిత్రి కి 
సడెన్ గా ,కూతురు శిరీష గుర్తుకు వచ్చింది.ఎక్కడా
కూతురి అలికిడి వినిపించక పొవడం తో ,లేచి 
ఇల్లంతా వెదికింది సావిత్రి .శిరీష కనిపించలేదు .
గదుల్లో మూలమూలల్లో వెదికింది.కూతురి జాడ లేదు ,బయట వర్షం పడుతోంది ,బయటకి చిన్న పిల్ల 
వెల్లే ప్రశక్తి లేదు .సావిత్రికి ఖంగారు మొదలయి 
ఏడుపుమొదలు పెట్టింది .విశయం తెలుసుకున్న 
తల్లి సుందరమ్మ కూడా మొత్తం వెదికింది ,కానీ 
ప్రయోజనం లేకుండా పొయింది. ఏమి చేయాలో 
తెలియక ఇద్దరూ ఏడవడం మొదలు పెట్టారు .
               ఇంతలో పని ముగించుకుని వెంకట్రావు 
ఇంటికి వచ్చాడు.విశయం తెలుసుకుని అతను కూడా ఖంగారు పడ్డాడు.ఎందుకైనా మంచిదని 
ఇంటికి వెనుక కాస్త దూరంలో ఉన్న పశువుల పాక 
దగ్గరకి వెల్లాడు వెంకట్రావు .అక్కడ బయటి ప్రపంచం తో ,సంబందం లేనట్టు ,పాక చూరు క్రీంద
నీటి ప్రవాహంలో ,కాగితం పడవల తో ,హాయిగ 
ఆడుకుంటోంది 
వెంకట్రావు ,పరిగెత్తుకుని వెళ్లి ,మనవరాలిని 
ఎత్తుకుని ,వళ్ళంతా ముద్దులు పెట్టుకుని కళ్ల 
నీళ్లు పెట్టుకున్నాడు.తండ్రి వెనుకనే పాక వైపు వచ్చిన సావి త్రి ,కూతురిని చూసి ," ఎంత ఖంగారు 
పెట్టావే శిరీ .." అంటూ ఎత్తుకుని ముద్దాడింది.
వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారో ,చిన్నారి శిరీష కు 
ఏమాత్రం అర్థం కాలేదు ." అమ్మడూ ..బయటి కి 
వెళితే చెప్పివెళ్ళాలి ..నాన్నా !!" అన్నాడు ,మనవరాలి వీఁపు నిమురుతూ వెంకట్రావు 
"...ఓ ..సారీ తాతయ్యా " అంటూ ,తల్లికి మరింత 
అతుక్కుపోయింది శిరీష .