బాలలకెంతో ఇష్టం ఇష్టం
బాలలకెంతో ఇష్టం ఇష్టం!!బాలల!!
నిండుజాబిలి మెరిసేచోటూ
బోలెడుచుక్కలు ఉండేచోటూ
నీలిమబ్బులు తిరిగేచోటూ
ఇంద్రధనువు విరిసేచోటూ
ఎన్నోపక్షులు ఎగిరేచోటూ!!బాలల!!
పచ్చికబయలు ఉండేచోటూ
పచ్చనిచెట్లు పెరిగేచోటూ
రంగులపువ్వులు విరిసేచోటూ
పరిమళాలు ప్రభవించే చోటూ
పశువులు పక్షులు తిరిగేచోటూ!!బాలల!!
అమ్మానాన్నలు ఉండేచోటూ
బామ్మాతాతలు ఉండేచోటూ
అన్నాచెల్లీ ఉండేచోటూ
అక్కాతమ్ముడు ఉండేచోటూ
నేస్తాలందరు కలిసేచోటూ!!బాలల!!
*ఇష్టం*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి