ఏప్రిల్ ఫూల్ కధ....:--మొహమ్మద్ .అఫ్సర వలీషా ద్వారపూడి (తూ గో జి)

 బాలలూ మీకు తెలుసా..
ఏప్రిల్ ఫూల్ కూ ఓ కధ ఉంది 
పదహారవ శతాబ్దం మధ్య వరకు యూరప్ లో సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది
నూతన సంవత్సర 
వసంత కాలపు ఉత్సవాలు 
ఓ పదిరోజుల పాటు జరిగేవి
ఉత్సవాలు ముగియగానే
ఏప్రిల్ 1 న లాంఛనప్రాయ
బహుమానాలు ఇచ్చుకునేవారు
ఇలా నిత్యం జరిగే కార్యక్రమానికి
 ఒక పెను మార్పు వచ్చింది 
సంవత్సరాదిని ఫ్రాన్స్ దేశపు రాజు
జనవరి ఒకటవ తారీఖున మార్చడమైనది
సకాలంలో అందరికీ అందనిది ఆ వార్త
అందిన వాళ్ళు కూడా పాత
అలవాటు మానుకోలేక పోయారు
సంవత్సరాది జనవరి 1న జరిగినా
అక్కడక్కడా ఏప్రిల్ 1న
బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం
మాననందున వారిని ఏప్రిల్ ఫూల్స్ అంటారు...