*న్యాయపతి రాఘవరావు*: డాక్టర్ , అమ్మిన శ్రీనివాస రాజు

 1905వ సంవత్సరం ఏప్రిల్ 13 న ఒరిస్సాలోని బరంపురం లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసారు. 1934 లో కామేశ్వరితో పెళ్ళయింది. రేడియో అక్కయ్యగా ప్రఖ్యాతి గాంచిన న్యాయపతి కామేశ్వరి ఈమెనే!. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
రేడియో అన్నయ్య
రచనలు:-
రేడియో అన్నయ్య సృష్టించిన పాత్రల్లో మొద్దబ్బాయి, పొట్టిబావ, చిట్టిమరదలు, దొడ్డమ్మ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, పిల్లలకే స్వరాజ్యం వస్తే, చీమ కథ, ఏనుగొచ్చిందేనుగు, బడి గంట, మడతకుర్చీ, రామూ సోమూ, పిల్లల దొంగ ఇంకా అనేక హాస్య నాటికలు, గమ్మత్తు నాటికలు, చిట్టి నాటికలు దాదాపు పన్నెండు వందలకు పైగా రచించి వాటిని పిల్లలతో వేయించారు. దాదాపు పది చలన చిత్రాలలో కూడా పిల్లలచే వేషం వేయించాడు. అనేక గ్రామఫోను రికార్డులు ఇచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎవరూ, ఏ సంస్థా , ఏ ప్రభుత్వమూ చేయనంత కృషి సలిపారు. 1940లో మద్రాసులో ఆంధ్ర బాలానంద సంఘం స్థాపించారు,
పిల్లలకోసం "బాల"మాసపత్రిక స్థాపించి తెలుగు పిల్లల పత్రికలకు నాంది పలికారు,
24ఫిబ్రవరి 1984లో అనారోగ్యం తో హైదరాబాదు లో మరణించారు,
కామెంట్‌లు