అమ్మ నాకు చెప్పవే
కమ్మని కథ ఒక్కటీ
కథవింటూ నిద్దురలో
కలగంటానే
మంచి కలగంటానే॥
రాజు కథా రాణి కథా
వద్దే నాకు
కాకి కథా నక్క కథా
అసలే వద్దు
శాస్త్రజ్ఞుల కథలు నాకు
చాల చెప్పవే ॥
ఎలుక కథా పిల్లికథా
వద్దే నాకు
కోతి కథా మొసలి కథలు
అసలే వద్దు
వీరసింహాల కథలు నాకు
వేలు చెప్పవే
వేల వేలు చెప్పవే॥
ఈగ కథా దోమ కథా
వద్దే నాకు
చీమ కథా పాము కథా
అసలే వద్డే
ధీరులైన నాయకుల
కథలు చెప్పవే
స్వతంత్య్ర వీరుల
కథలు చెప్పవే
వీరుల కథలు చెప్పవే॥
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి