సీత జడకుచ్చులు -బాలగేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
సీతమ్మ వారి జడకుచ్చులు 
సింగారమొలికే పూలమొక్కలు 
ఎరుపు తెలుపూ పసుపురంగులో 
ముంగిలికి వస్తాయి మెప్పులు!

మెరిసే వింతయిన ఆకారం 
గింజలు పూలకే అతుకులు 
చాలా రోజులు తాజాదనం 
ఇంటి అలంకరణ వస్తువులు!

నేలలో నాటితే పెద్ద గుత్తులు 
కుండీలలోన చిన్న పువ్వులు 
ఎదగాలంటే సత్తువుండాలోయ్ 
బాలలూ  మొక్కలు ఒకటేనోయ్!