శ్రీ శ్రీ సాహిత్య సేవ జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్

సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో శ్రీశ్రీ జయంతి సందర్భంగా సాహిత్యంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రచయితలకు సాహితీ పురస్కారం  అందించారు.. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు " శ్రీ శ్రీ సాహిత్య సేవ జాతీయ స్థాయి  పురస్కారం 2021" ని అందించారు.
     తెలుగు సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన మహాకవి శ్రీశ్రీ పురస్కారాన్ని  నేటి కాలంలో రచనా రంగంలో సమాజాన్ని మేల్కొల్పుతూ రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ వివిధ ప్రక్రియల ద్వారా  తన సేవలు అందిస్తున్నందుకు శ్రీ శ్రీ సాహిత్య సేవ జాతీయ స్థాయి  పురస్కారం  ని అందించామని సాహితీ బృందావన వేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు  శ్రీమతి నెల్లుట్ల సునీత తెలియజేశారు.
      ప్రశంసా పురస్కారాన్ని అందజేసిన సంస్థ జాతీయ అధ్యక్షురాలు  నెల్లుట్ల సునీత గారికి, సంస్థ గౌరవ సలహాదారులు ఏనుగు నరసింహారెడ్డి అడిషనల్ కలెక్టర్, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి, మరియు సంస్థ కోశాధికారి పి సాయి తరుణ్ గార్లకు రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్  దన్యవాదములు తెలియజేశారు
2 Attachments


కామెంట్‌లు