" సాహిత్య కళానిధి " డాక్టర్ చిటికెన  సాహితీ బృందావన విహార జాతీయ వేదిక ఖమ్మం, తెలంగాణ.. వారు ప్రతిష్టాత్మకంగా జాతీయ ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారాలు నిర్వహించారు. 2021 కి గాను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. సాహిత్యంలో విశిష్ట సేవలు అందిస్తున్న యువ సాహితీవేత్తల లో ప్రత్యేకంగా తన రచనలు  కొనసాగు తున్నాయని అందుకు * సాహిత్య కళానిధి *  బిరుదును అందిస్తున్నట్లు గా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత తెలియజేశారు.  సంస్థ ప్రధాన కార్యదర్శి వాకిటి రామ్ రెడ్డి, కోశాధికారి పసునూటి  సాయి తరుణ్, గౌరవ సలహాదారులు ఏనుగు నరసింహారెడ్డి ( అడిషనల్ కలెక్టర్ ), శ్రీ పొట్లూరి హరి కృష్ణ తదితరులు కిరణ్ కుమార్ ను అభినందించారు.