జూకా మందారం -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి
ఊగుతూ మెరుస్తుంది 
జూకా మందారం 
జోరుగా మురుస్తుంది 
రేకుల వయ్యారం!

పూలన్నీ పైకీ పక్కలకు 
చూస్తూ ఉంటాయి 
జూకా మందారాలేమో 
కిందకే చూస్తాయి!

ఎదిగే కొలదీ ఒదిగేఉండు
వినయంతోటి అడుగేస్తుo డు 
యెర్రని రేకుల విప్లవ గీతం 
జూకా మందారం చక్కనిపుష్పం 


కామెంట్‌లు