తెలివైన కోడలు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.


 


అమరావతి నగరంలోని విశ్రాంత అటవి శాఖాధికారిరాఘవయ్య తనఇంటి అరుగుపై చేరిన ఆవాడకట్టు పిల్లలుఅందరికి మిఠాయిలు పంచి'బాలలు ఓర్పు,సహనం,మనిషిని ఉన్నతశిఖరాలకుచేర్చుతాయి.సహనంతో ఒక కోడలు తనఅత్తగారిని ఎలామార్చుకుందో తెలిపే కథమీకుచెపుతాను..

పూర్వం పేరమ్మఅనే గయ్యళి వృధ్ధురాలు ఉండేది.ఆమె పరమ పిసనారి ఇంట్లో ఆమె చెప్పినట్లే వండాలి.ఆఊరిలో అందరు ఆమె నోటికి భయపడేవారు.పేరమ్మకు దైవభక్తి ఎక్కవ.ఉదయం సాయంత్రం క్రమంతప్పకుండా పలు దేవాలయాలకు వెళుతుండేది.సాదుస్వభావం కలిగిన విజయ అనే అమ్మయి సంపన్నకుటుంబంలో నుండి పేరమ్మ కోడలుగా ఆఇంటికి వచ్చింది. అత్తగారి నోటికి భయపడి ఆమెచెప్పినట్లే నడుచుకునేది.ఓకరోజు పోరుగింటి మీనాక్షమ్మగారు పెరటి గుమ్మంవైపు పిలిచి 'ఈరోజు దేవునికి ప్రసాదంగా మాయింట్లో చక్రపోంగలి చేసాము'ఇదిగో అంటూ పిట్టగోడపైనుండి గిన్నెనిండుగా అందించింది.ఆచక్రపొంగలి ప్రసాదం తీసుకువెళ్లి అత్తగారికి చూపించింది.కొంతప్రసాదం కళ్లకిఅద్దుకుని నోట్లో వేసుకున్నపేరమ్మ 'అబ్బాయికి చక్రపొంగలి చాలాఇష్టం దాచి ఉంచు రాత్రికి తింటాడు'అంది.తనకు చక్రపొంగలి అంటే తనకు చాలాఇష్టం కాని అత్తగారి మాటకు ఎదురుచెప్పలేని విజయ తనభర్తకొరకు ప్రసాదం దాచి ఉంచింది.సంపన్నకుటుంబంలో జన్మించిన విజయ అత్తవారింట చాలా ఇబ్బంది పడసాగింది.బాగాఆలోచించి తన అత్తగారిమనసు నోప్పించకుండా ఇంట్లో అందరూ సంతోషంగా పిండి వంటలు తినేలా అత్తగారిని మార్చేందుకు ప్రయత్నిస్తూ ,ఒకరోజు తెల్లవారుతూనే తలస్నానం చేసి అత్తగారు చూస్తుండగా బెల్లాన్నిచిన్నముక్కలుగా చేయసాగింది.'ఏమిటి అమ్మయ్ బెల్లంతో పని'అంది కోపంగా 'అత్తయ్య రాత్రి దేవుడు  కలలో కనిపించి తనకు చక్రపొంగలి ప్రసాదంచేసి పెట్టమన్నాడు. దేవునికోరిక కదా,అందుకే చక్రపోంగలి చేస్తున్నాను. మీకుఇష్టంలేకుంటే మానివేస్తాను'అందివిజయ.దేవునికి ప్రసాదం అనగానే సహజంగా భక్తురాలు అయిన పేరమ్మ'అయ్యో దేవుడి ప్రసాదంచేయడానికి నాఅనుమంతి ఎందుకు అలాగే కానివ్వు'అంది.అలా చక్రపొంగలి శనివారం తిని తనకోర్కే తీర్చుకుంది.కొద్దిరోజుల అనంతరం'అత్తయ్య మంగళవారం ఆంజనేయస్వామికి వడలమాల వేసిరండి నేనుచేస్తాను అంది.దేవునిపేరు వింటూనే పేరమ్మతలఊపింది.మరికేద్దిరోజుల అనంతరం శుక్రవారం లక్ష్మీ దేవికి పాయసంచేసి అత్తగారికి అందించింది.అలా కోడలు ఏపదార్ధలు చేసిన ఏదేవుడి ప్రసాదమో అనుకుంటూ, వంటగది వైపు వెళ్లడం మానుకుంది. పేరమ్మ.

 బాలలు విన్నారుగా కోడలు విజయ తనఅత్తగారిని తెలివిగా ఎలా మార్చుకుందో.ఓర్ప,సహనం,ఆలోచనఉంటే ఏది అసాధ్యంకాదు.అన్నాడు రాఘవయ్యతాత.


కామెంట్‌లు