-లౌకిక కరోన:--దుగ్గి గాయత్రి-టి.జి.టి.తెలుగు,కల్వకుర్తి,నాగర్ కర్నూల్,తెలంగాణ.


 రోజు ఎప్పటిలాగానే ఆడుకోవటానికి రాని రాబర్ట్ ఇంటికి వెళ్లారు రామ్,రహీమ్ లు.అక్కడ  ఆసుపత్రిలో  కరోనా  రోగులకు వైద్యులుగా సేవలందిస్తున్న  రాబర్ట్ అమ్మానాన్నలు విగత జీవులై పడి ఉన్న హృదయ విదారకమైన సంఘటన చూసి ఏడుస్తూన్న  రాబర్ట్ దగ్గరికి వెళ్లి ఓదార్చారు రామ్, రహీమ్ లు. అక్కడ అంత్యక్రియలు పూర్తయిన పిమ్మట అనాథ అయిన రాబర్ట్ గుండెలవిసేలా ఏడుస్తూనే ఉంటాడు.కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన కూడా రాబర్ట్ ను బంధువులెవరు చేరదీయలేదు. ఆ పరిస్థితిలో రామ్,రహీమ్ లను వారి తల్లిదండ్రులు కూడా రాబర్ట్ వద్దకు వెళ్లనీయలేదు,కానీ వాళ్లిద్దరూ కారణం ఏమిటని ప్రశ్నించటంతో రాబర్ట్ వేరే మతం వాడు కాబట్టి తమ ఇంటికి రానీయటం తమకు ఇష్టం లేదని చెప్పి తప్పించుకుంటారు.ఈ మాటలకు రామ్, రహీమ్ లు ఎంతో బాధపడి కులం,మతం అంటూ చూడకుండా రాబర్ట్ వాళ్ళ అమ్మానాన్నలు ఎంతో మంది రోగులకు ప్రాణభిక్ష పెట్టారు కదా అంతెందుకు మీకు కరోనా వచ్చినప్పుడు కూడా రాబర్ట్ వాళ్ళ అమ్మానాన్నల వైద్యంతోనే ప్రాణాలతో బయటపడ్డారు కదా మరి మీరు ఇలా మాట్లాడటం సరికాదని తెలియచేసి రామ్, రహీమ్ లు వాళ్ళ అమ్మానాన్నల కళ్ళు తెరిపిస్తారు.రామ్,రహీమ్ లు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వెళ్ళగా  రామ్ తల్లిదండ్రులు రాబర్ట్ ను దత్తత తీసుకుంటారు. రాబర్ట్ చదువుకు అవసరమైన సదుపాయాలను తాము చూసుకుంటామని రహీమ్ వాళ్ళ అమ్మానాన్నలు మాట ఇవ్వటంతో రామ్,రాబర్ట్,రహీమ్ లు ఎప్పటిలాగానే కలిసి మెలిసి సంతోషంగా వుంటారు.


కామెంట్‌లు