పండుగంటు మనము పరవశించెద మోయి
పచ్చతోరణముల పంది రేయు
మామిడాకులందు మంచి ఆరోగ్యము
వేము జంపు క్రిముల వేగిరముగ
ఇల్లు శుద్ధి జేయ యిల్లంతా కడిగియు
పాచి నంత తుడువ పావనంబు
బట్టలన్ని యుతికి బహు శుభ్రముజేయు
బాహ్యశుద్ది వలన బ్రతుకు బాగు
తెల్లవారగానె కళ్లాపి చల్లియు
అందమైన ముగ్గు లల్లు చుండు
వాకిలంత వేయు వయ్యారి రంగులు
కడపలన్ని దిద్దు కళలతోడ
కొత్త బట్టలేసి కోరిక తీరంగ
చెంగు నెగురుచుండు చెలిమి తోడ
పర్వదినమునందు పరమ సంతోషంబు
చిన్న పెద్దలంత చిందులేయు
8⃣2⃣0⃣
మంచిచెడులు తెలుపు మంచి పంచాంగము
శ్రవణమెంతొ జేయ శాంతి గలుగు
అయ్యవారు జెప్పు నాచార పద్ధతి
వినియు నాచరించు విజ్ఞతముగ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి