నీ..పిలుపు కోసం...!!:- -------డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మకొండ .

 ఆ..
పిలుపు కొసం ,
ఎప్పుడూ ..
ఎదురు 
చూస్తూనె ఉంటాను !
ఆ ...
మధుర స్మృతులు 
తలచుకుంటూ ,
గతాన్ని ....
ఒక్కొక్క 
గులాబీ లా 
బయటి కి తీసి ,
కుసుమ పరిమళాన్ని 
ఆస్వాదిస్తుంటా ...!
గతించిన రోజులు ...
నాటి అనుభవాల 
జ్ఞాపకాలు,
నిత్యం 
సింహావలోకనం 
చేసుకుంటూనే ఉంటాను .
మళ్లీ ..మళ్లీ ...
అలనాటి 
ఆనంద సుగంధ 
సన్నివేశాలను 
స్మరించుకుంటూ ...
ఇప్పుడూ..
ఎప్పుడూ ...
ఆ ...పిలుపుకోసం 
ఎదురు చూస్తూనే ఉంటాను !
ఆశాజీవిగా ..
ఎదురు చూస్తూనే ఉంటాను !!
     
కామెంట్‌లు