ఉత్తర ధ్రువం దగ్గర త్రాగిన నీరు దక్షిణ ధ్రువం దగ్గర దాహం తీర్చింది!?
చీకటి పాత్రను ధరించిన దాత్రి విశ్వమంతా తన సొంతమని నటించింది!?
నాలుగు దిక్కులు తలుపులు తెరిచిన వెలుగు చుక్కలు ఒక్కటి కూడా నలుపు ను కలుపుకోలేదు !?
నీళ్లకు కళ్ళు కాళ్లు లేకున్నా ముల్లోకాలు తిరిగి నారదునికి నదిగా నామకరణం చేసింది!?
గాలి కడుపునిండా తిని భూమి దుప్పటి కప్పుకుని సూర్య చంద్రులను నెత్తి కింద దిండి గా మార్చుకుని పగలు రేయి కలలు కంటున్నది!?
ధరిత్రిపై దశావతారాలు దేవుళ్ళ కైనా మనిషి అసలు అవతారం వాతావరణమే!?
ఆకాశంలో నదులు ప్రవహిస్తున్నాయి ప్రయాణిస్తున్న తెల్లని హంసల్లా!!
చీకటి తోటల్లో పూస్తున్న పూలు మెరుస్తున్న వి మైమరపిస్తున్న వి మన లోకాన్ని!!
కన్నేలోకం వంచిన నడుము ఒక ఒక భూమి విల్లంబు కానీ వెలుగు వంచిన రంగుల ఇంద్ర ధనుస్సు పై మగువ మనసు!!!?
అకాశం సముద్రంలో తుఫానులే ఉరుములు మెరుపులు విరిగి నేలకొరిగే ది నీరు ఒక్కటే సాక్షాత్తూ సముద్రమే ఆకాశానికి అయినా భూమిక యినా ఒకటే!!
ముత్యాలు రాలినట్లు యుద్ధంలో శబ్దాలు రాలుతున్న వి
ఓడిన గెలిచిన నా ఏరిన శబ్దాలు లెక్కించి ఎంతో ఎత్తుకు ఎదిగిన గెలాక్సీ ఇది!?
అమృతాన్ని తాగిన సూర్యుని చంద్రుని మర్చిపోయాం
విశ్వంలో పరిగెత్తే అశ్వాన్ని చూసి చూసి పాపం నేలకొరిగే ది మనిషి ఒక్కడే కాదు
ఇప్పుడు అమృతం తాగిన ఆ తారలు కూడా !?
బ్రతకడానికి వజ్రాయుధం ఒక్కటే సరిపోదు కవచకుండలాలు కూడా కావాలి
వెలుగు చీకటి ఎప్పటికీ ఓడిపోవు గెలువవూ !?
కాస్త చోటు ఇవ్వు శూన్యం లోనే కాదు విశ్వంలోనే వామనుడు తిరుగుతున్నాడు వాడు ఇప్పుడు ఒక్క అడుగు భూమి అడుగుతున్నాడు!?
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి