కవి వతంసుడు..!---సుజాత.పి.వి.ఎల్.

 బులుసు వెంకటేశ్వర్లు ప్రముఖ కవి ,రచయిత, సాహితీ విమర్శకులు. వీరు 1956 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. కవి వతంస బిరుదాంకితులు.
ఈయన తూర్పు గోదావరి జిల్లా, పొడగట్లపల్లి శివారుప్రాంతమైన రామచంద్రాపురంలో 1906, ఏప్రిల్ 10న జన్మించాడు. ఇతడు మొదట వేదవిద్య, తరువాత ఆంగ్ల విద్యను అభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి వేదాంతంలో, తెలుగు సాహిత్యంలో రెండు ఎం.ఎ.పట్టాలు సంపాదించాడు. తరువాత తెలుగు ఉపన్యాసకునిగా 30 సంవత్సరాలు పనిచేసి 1963లో పదవీ విరమణ చేశాడు. ఇతడు గొప్ప వచన రచయితగా, వక్తగా రాణించాడు.
(నేడు ఏప్రిల్'6 కవి బులుసు వెంకటేశ్వర్లుగారి జయంతి సందర్భంగా.)