మొక్క ఉపేందర్ కు ఉత్తమ సాహితీవేత్త ఉగాది అవార్డు*


 కొంతకాలంగా తెలుగు సాహిత్యంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను ప్రముఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి మొక్క ఉపేందర్ కు ఉత్తమ సాహితీ వేత్త అవార్డు ప్రధానం చేస్తూ తెలుగు జాతీయ దినపత్రిక జోర్దార్ యాజమాన్యం ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రకటించారు. జోర్దార్ పత్రిక వ్యవస్థాపకులు ఆవుల రాజేశం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాశీ సత్యనారాయణ మూర్తి చేతుల మీదుగా ఉగాది పర్వదినం సందర్భంగా ఆన్ లైన్ వాట్సాప్ ద్వారా మొక్క ఉపేందర్ అందుకున్నారు. ఈ ఉగాది పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాలలో మరియు ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న సుమారు మూడువేల మంది కవులు తమ కవితలు పంపగా 60 మందిని మాత్రమే ఎంపిక చేశారు ఈ 60 మంది లో ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మొక్క ఉపేందర్ ఉండడం పట్ల యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు, దివ్యాంగుల కాలనీ అన్నోజిగూడ ప్రజలు తమ ఆనందాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గా కవి మొక్క ఉపేందర్ తన ప్రతిభను గుర్తించి ఉత్తమ సాహితీవేత్త ఉగాది2021 పురస్కారం అందజేసిన జోర్దార్ పత్రిక యాజమాన్యం కు కృతజ్ఞతలు తెలియజేశారు