పుస్తకం:-- యామిజాల జగదీశ్

 పుస్తకం
చైతన్యపరిచే ఆణిముత్యం
జ్ఞానానిచ్చే కేంద్రం గ్రంథాలయం
ప్రతి పేజీ పేచీగా చూడక
చదివితే అనుభవమవుతుంది
మానసిక గందరగోళానికి
దివ్యౌషదమవుతుంది
చదివేకొద్దీ
చదవడమనేది శ్వాసవుతుంది
తలవంచి చదివింపచేసినంతమాత్రాన
తలవంపనుకోకు
తలెత్తుకునేలా నడిపిస్తా
నలుగురూ నిన్ను చూసేలా చేస్తాననే
పుస్తకం ప్రతి ఒక్కరికీ 
ఓ మంచి నేస్తం

కామెంట్‌లు