పల్లెటూరి ఉషోదయం (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
కోడిపుంజు లేసింది
చుక్క పొద్దు చూసింది
మొదటి కూత కూసింది
భూతల్లిని నిద్ర లేపింది

అవని తల్లి అలికిడితో
లేగ దూడలు అరిచాయి
నానా నిద్ర లేచాడు
పొలం పనులకు వెళ్ళాడు

సింధూరము రంగులో
ఎర్ర రంగు కిరణాలతో
ఉదయ భానుడొచ్చాడు
అరుణ కాంతులు చూపాడు

గూటిలో పక్షులు లేచాయి
రెక్కలు విప్పి ఎగురాయి
కిలకిల పలుకులు పలికాయి
పల్లెల్లో ఉషోదయం చూపాయి