పండుగ వచ్చిందీ
ఉగాది పండుగ వచ్చిందీ
కోయిల కూసిందీ
నల్లని కోయిల కూసిందీ
మామిడి కాసిందీ
గున్న మామిడి కాసిందీ
వేప పూసిందీ
చక్కగ వేప పూసిందీ
చెరుకు పెరిగిందీ
తోటలొ చెరుకు పెరిగిందీ
పచ్చడి చేశామూ
ఉగాది పచ్చడి చేశామూ
పచ్చడి పెట్టిందీ
అమ్మ పచ్చడి పెట్టిందీ
రుచులు ఉన్నాయీ
ఆరు రుచులు ఉన్నాయీ
మేము ఆరగించామూ
మేము మొత్తం ఆరగించామూ
మేము ఆనందించామూ
మేము అందరం ఆనందించామూ !!
*ఉగాది*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి