నవయుగ వైతాళికుడు.....: -మొహమ్మద్. అఫ్సర వలీషా-ద్వారపూడి (తూ గో జి)
తెలుగు జాతి 
కీర్తి కిరీటం ....

తెలుగువారి తొలి 
కాంతి కిరణం ....

సుబ్బారాయుడు పున్నమ్మ
దంపతుల పుణ్య ఫలం ....

సత్యవంతై సహనశీలై సద్గుణ
సంపన్నుడైన  త్యాగ ఫలం....

సమాజ సేవకు సమస్త 
జీవనసమర్పణకు 
అంకురం....

సకల కళా పోషకుడు 
సంఘసంస్కర్త అయి 
సాహిత్యానికి  జీవం....

స్త్రీ ఉద్యమానికి అగ్గి 
రాజిల్లిన నిప్పు కణం....

సతీసహగమన బాల్య
వివాహ వ్యవస్థకు వ్యతిరేకం ...

సంఘ స్థాపనలో వెలకట్టలేని 
స్త్రీ పునః వివాహ ప్రచారం ....

ఈ బిరుదుల హరివిల్లు 
వర్ణలాన్నీ అద్దుకున 
నవయుగ వైతాళికుడు...

అంబరాన ఎగిసిన 
కీర్తి మయూఖం 
మన కందుకూరి వీరేశలింగం ......

ఆయనకు అర్పిద్దాం 
మనమందరం
హృదయపూర్వక
జన్మదిన వందనం 



కామెంట్‌లు