దారి తప్పిన చిలుక (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
మూగబోయిన ఆ చిలుక
గూడు నొదిలి వచ్చింది
మోడుమీద వాలింది
గమ్మున చూస్తూ కూర్చుంది

దారితప్పిన ఆ చిలుక
దిక్కు లేమొ చూస్తుంది
పక్కుమని ఏడుస్తూ
అమ్మ కావాలంటుంది

రెక్కలు విప్ప నంటుంది
పక్కకు వెళ్ళనంటుంది
ఓరకంట చూసుకుంటూ
ఒంటరిగా ఉండనంటుంది

చిలుకల వనము వదిలింది
కిలకిల పలుకుతూ వచ్చింది
గూడు చేరుట కొరకు
తోటి పక్షుల కై చూస్తుంది


కామెంట్‌లు