ఒకరోజు రంగన్న తన గాడిదను తీసుకుని చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. మార్గ మధ్యంలో ఒక ఎత్తైన గుట్ట దాట వలసి వచ్చింది.
గాడిద ఎక్క లేక పోతోంది,రంగన్న అలసి పో సాగాడు!
ఇంతలో ఎదురుగా ఒకడు చేపల బుట్టతో వచ్చాడు.
"ఏమిటి గాడిదతో కష్టపడు తున్నావు,గాడిదను అమ్ముతావా?"అని అడిగాడు.
గాడిదతో ప్రయాణం కష్టమని భావించి, "అమ్మేస్తాను" అని చెప్పాడు రంగన్న.
"నా దగ్గర డబ్బులు లేవు, బుట్ట లో మూడు చేపలు ఉన్నాయి,ఇవి తీసుకుని నాకు గాడిదను ఇచ్చేయి"అన్నాడు.
అమాయకుడైన రంగన్న చేపలు తేలిక ఇంటికెళ్ళి మంచి చేపల కూర తినవచ్చు అను కుంటూ గాడిదను ఇచ్చి చేపల బుట్టను తీసుకుని ఇంటికి వెళ్లి బుట్టను వాడి అమ్మ కు ఇచ్చి జరిగిన సంగతి చెప్పాడు.
మొదట వాడి అమాయకత్వానికి తిట్టుకున్నా
బుట్ట తెరచి చేపలను చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అవి అరుదైన,ఖరీదైన ట్యూనా చేపలు. రంగన్న కు ఇంట్లో వండిన పాలకూర పప్పు అన్నం పెట్టి, వాడిని తీసుకుని ఆ దేశపు రాజు గారి వద్దకు వెళ్లి చేపలను చూపి బుట్టను ఇచ్చింది.
రాజు గారి వంటవాడు ఆచేపల్ని చూసి రంగన్నను వాడి అమ్మను పొగిడి,ఇటువంటి చేపలు అరుదైనది,ఖరీదైనవి అని రాజు గారికి వివరించాడు.
అంతమంచి చేపలను వారు తినకుండా తన మీద గౌరవంతో తనకు ఇచ్చినందుకు రాజు గారు ఎంతో సంతోషించి రంగన్నకు వాడి అమ్మకు ఐదు బంగారు నాణేలు ఇచ్చాడు. గాడిద పోయినా,ఐదు గాడిదలు కొనగలిగిన బంగారం వచ్చింది రంగన్నకు.
మంచి గాడిదను కొందామని తల్లీ కొడుకులు సంతకు వెళ్లారు. అదృష్టవశాత్తు రంగన్న గాడిదను రంగన్న కు చేపలు ఇచ్చిన వాడు అమ్ముతున్శాడు.వాడికి ఒక బంగారు నాణెం ఇచ్చి
తన గాడిదను తాను తీసుకుంది రంగన్న అమ్మ.
బంగారు నాణెం ఎక్కడిది అని చేపలు ఇచ్చిన వాడు అడిగాడు.
తల్లి వారిస్తున్నా రంగన్న చేపలు రాజు గారికి ఇచ్చిన సంగతి,బంగారు నాణేలు పొందిన సంగతి
చెప్పాడు. చేపలు ఇచ్చిన వాడు "మరి నా చేపల వలన అంత లాభం పొందావు
,మరో బంగారు నాణెం ఇవ్వు" అన్నాడు.
"నీ కెందుకివ్వాలి చేపలు ఇచ్చి ఖరీదైన గాడిదను తీసుకోవాలని ఎత్తు వేశావు,మా అదృష్టం బాగుండి మంచి చేపలు మాకు వచ్చాయి.నీవు చేపలు ఇచ్చి గాడిదను తీసుకున్నప్పుడే నీతో బేరం అయిపోయింది"అని గట్టిగా చెప్పింది రంగన్న అమ్మ.
"చేసిన మోసం భగవంతుడు చూస్తూనే ఉంటాడు,తగిన శాస్తి నాకు చేశాడు" అని తలపట్టుకున్నాడు చేపలు అమ్మిన వాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి