*కుక్క - నక్క*(గేయకథ): -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
(మొదటి భాగము)
1)
అడవిలోని ఒక నక్క
ఊరిలోని ఒక కుక్క
కలిసికొనెను చేనుపక్క
ఊసులాడుకొనెను చక్క !
2)
ఆ చేనులోన ఉన్నట్టి
సొరకాయల జుచినట్టి
నక్కకేమొ నోరుఊరె
నేస్తం! "తిందామ"ని కోరె !
3)
"చెలుడా! మరి తినలేవు
వండక ఆ సొరకాయ
తీపి వగరు రుచి ఉండదు
వండిన అది రుచికి మెండు" !
 4)
అని చెప్పిన కుక్కవంక
అనుమానపు చూపునింక
చూచుచుండె నక్క సుంత
నమ్మని మాటలనంత !
5)
ఆ చేనులో ఒకపక్క
నివసించెను ఒక ఎలుక
ఎలుక వంక జూపి కుక్క
ఈవిధముగ చెప్పె చక్క !
(ఇంకావుంది)