ప్రకటనల పర్వం:-- యామిజాల జగదీశ్
 నిజమే, మార్కెటింగుకి కింగు ప్రకటనతీరే. కానీ ప్రకటనలు వెర్రితలలు వేస్తున్నాయనిపిస్తోంది. లేకుంటే నాకు ఆ ప్రకటనల మాటలు కానీ వాటిలో ఒదిగిన భావం కానీ నా మట్టిబుర్రకు అందడం లేదా....కావచ్చు. 
టూత్ పేస్టుల విషయానికొస్తే పళ్ళు తోముకుని డ్యాన్స్ చేయడమేమిటో అర్థం కాదు.
ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఒకరు కాఫీ అమోఘమనడం, తమ్ముడేమో టీ అమోఘమనడం, మరొకరేమో హెర్బల్ కషాయం అద్భుతమనడం....ఇంతకూ అసలు ఈ ముగ్గురూ ఇంట ఏం తాగుతారో తెలుసుకోవాలని ఉంది.
ఇక కూల్ డ్రింకుల ప్రకటనలలో ఒకటి!
ఇద్దరూ ఎందుకు అదోలా చూస్తారో...ఓ సీసాని చూసాక వీపుమీద ఎక్కడమేమిటో, మెట్లెక్కి మళ్ళీ ఉన్న చోటికే వచ్చి ఎవరికో ఫోన్ చేస్తానని సైగ చేయడమేమిటో....ఒక్క భావమూ బోధపడలేదు. 
మరొక కూల్ డ్రింక్...
పది రూపాయలో ఇరవై రూపాయలో ఇస్తే ప్రశాంతంగా కొనుక్కుని నింపాదిగా తాగడం మానేసి కిందా మీదా పడటం...చెమటలు కక్కడం.... వేసుకున్న బట్టలు మురికిపట్టడం....ఎందుకిలా.....
టూత్ పేస్టుల ప్రకటనల చిత్రీకరణ అతిగా అన్పిస్తుంటుంది. పళ్ళు తోముకుని ఎగరడాలేమిటో బోధపడటం లేదు. 
పైగా మరికొన్ని ప్రకటనలలో ఒకేరకానివి ఒక్కో భాషలో ఒక్కో మాట....అర్థాలు మారిపోయి..... చాక్లెట్ ప్రకటనలుసరేసరి!!
ఇక ఓ సుగంధపరిమళ ద్రవ్యం తినడానికి రోడ్లోకొచ్చి ఒకడు ఎగురుతుంటే వెనకాతల అయిదుగురో పది మందో ఎందుకు డ్యాన్స్ చేస్తారో అర్థం కాలేదిప్పటికీ....
ఇలా చెప్పుకుంటూపోతే అనేకం!!
నా మట్టిబుర్రకీ 
నా చూసేతీరూ 
మారాలంటారేమో
ప్రయత్నిస్తాను!



కామెంట్‌లు