అందాల రాముడు
అందరికి దేవుడు
రామాయణ కథనిప్పుడు
బాలలూ తెలుసుకొనుడు!
బాల్యమునే గురుకుల విద్య
తమ్ములతో మంచి సయోధ్య
శివ ధనువే స్వామికి లక్ష్యం
సీతా స్వయo వరం హారం !
కైక కిచ్చిన తండ్రి మాట
నిలుపుట కొరకే అడవి బాట
పట్టిన రాముని అనుసరించుట
కర్తవ్యముగా లక్ష్మణ, సీతలట!
భరతుడొచ్చి భయభక్తులతోడ
రమ్మని పిలువగ సరిగాదనెను
పాదుకలడిగి పావనమూర్తిని
పీఠమునుంచి రాజ్యం చేసే!
పర్ణశాలలో పరమ సాధువులు
వనవాసమును నడుపుచుండ
రావణ సోదరి శూర్పణఖవల్ల
లక్ష్మణ కోపించి గాయపరిచే
అవమానంతో రగిలిన రావణ
అనుచర మారీచుని పంపగ
బంగరు మాయలేడి రూపంలో
వచ్చి సీతను వంటరి చేసేను!
దొంగసాధువు రూపిగా దశకంఠ
మోసo సీతాపహరణ చేసెను
అడ్డు పడిన జటాయు రెక్కలు
అయ్యో పాపం ఖండించాడు !
లంకకు చేర్చి అశోకవనమున
సీతనుంచి పెండ్లాడుమనెను
రామభద్రుడు నినుచంపునని
సీతాదేవి శపించు చుండెను!
వగచిన రాముడు వానరసాయం
వారధికట్టి లంకను జేరెను
పోరున కూలిన లక్ష్మణస్వామిని
హనుమ సంజీవితోడ లేపెను!
రావణుగూల్చి అయోధ్య చేరి
పట్టాభిషేకమున రామరాజ్యం
ఒకే బాణం ఒకటే మాటగా
శ్రీరామచంద్రుడు పాలనచేసెను!
శాంతం స్నేహం రామాయణం
ఇతిహాసముగా నేటికీనిలిచే!
ధర్మం తప్పుట దశకంఠునికి
రమ్యలంకకు చేటు చేసెను!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి