మొక్కలు నాటాలి -బాల గేయం :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా 
మొక్కలు తప్పక నాటాలమ్మా 
ఊపిరి అందని  బ్రతుకెట్లమ్మా 
ఊహకు కూడా కనపడదమ్మా!

డబ్బుల మీది దురాశ తోటి 
దబ్బున వచ్చే ఫ్యాక్టరీలెన్నో 
కలుషితమైన గాలుల తోటి 
ప్రాణుల బ్రతుకు గండాలెన్నో !

పచ్చని చెట్ల

ను నరుకుటయేల
పులుగుల,  పశువులచంపుట ఏల 
కలుషిత జలాలు నదిలోఏలా? 
విలువలు వదిలే బుద్ధి అదేలా? 

వచ్చు తరాలకు డబ్బులు వద్దోయ్ 
పచ్చని వనాలు పెంచగముద్దోయ్ 
గాలి నీరూ కలుషితమైతే 
ధరణికి అగును అదేముప్పోయ్!